: మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో తెలంగాణ పోలీసుల దాడులు
పదుల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపారు. ఈ ఉదయం సీఐడీ పోలీసులు పలు వ్యభిచార గృహాలపై జరిపిన దాడుల అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 30 మంది యువతులకు విముక్తి కలిగింది. వీరిని స్థానిక కోర్టులో హాజరు పరిచి, ఆపై హైదరాబాదుకు తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మహారాష్ట్ర పోలీసులు సహకారం అందించారని సీఐడీ పోలీసు అధికారులు వివరించారు.