: అమెరికాలో డ్రగ్స్ తో పట్టుబడ్డ రాహుల్ గాంధీ: సుబ్రహ్మణ్య స్వామి రేపిన కొత్త వివాదం


2001 సంవత్సరంలో రాహుల్ గాంధీ అమెరికాలో డ్రగ్స్ తో ఉండగా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పట్టుకున్నారని, ఆ సమయంలో సోనియా గాంధీ వేడుకోలు మేరకు అప్పటి ప్రధాని వాజ్ పేయి కల్పించుకుని రాహుల్ గాంధీని విడిపించారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వద్ద 1.6 లక్షల డాలర్ల విలువైన వైట్ పౌడర్ దొరికిందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కు స్వయంగా ఫోన్ చేసిన వాజ్ పేయి ఆయన్ను విడిపించాలని కోరగా, అందుకు బుష్ అంగీకరించాడని ఓ హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి వ్యాఖ్యానించారు. బీజేపీ మంత్రుల మీద ఆరోపణలు చేసేముందు కాంగ్రెస్ నేతలు తమ తప్పులను తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. వసుంధరా రాజేను 'ఝాన్సీ కీ రాణీ'గా అభివర్ణించిన ఆయన, ఏ వివాదం నుంచైనా ఆమె సొంతంగానే బయటపడగలదని అన్నారు. వసుంధరా రాజేకు మద్దతుగా ఎవరూ మాట్లాడక్కర్లేదని అన్నారు. ఆమె నేరం చేయాలని ప్రయత్నించ లేదని, కేవలం మానవత్వాన్ని మాత్రమే చూపారని తెలిపారు. స్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రతిస్పందన వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News