: పుట్టిన రోజునాడే ఉరికంబానికి వేలాడనున్నాడు!


యాకూబ్ మెమన్... కరుడుగట్టిన ఉగ్రవాది. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో పోలీసులకు పట్టుబడి మరణదండన శిక్షను అనుభవించనున్న ఏకైక వ్యక్తి. ఈ నెల 30న మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో యాకూబ్ ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. యాకూబ్ పుట్టిన రోజు కూడా జూలై 30యేనట. జైల్లోని ఉరికంబాన్ని ఇప్పటికే పరిశీలించిన అధికారులు అది ఎంత బరువును తట్టుకుంటుందన్న విషయాన్ని పరీక్షించారు. ఆపై యాకూబ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని అందించామని, వైద్యులు నిత్యమూ ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారని జైలు అధికారులు వివరించారు. జైలు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News