: పుష్కరాలకు నీరు పుష్కలం... గోదావరిలో పెరిగిన ప్రవాహం!


మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. నిన్న మొన్నటి వరకూ మోకాళ్ల వరకూ కూడా నీరులేని పలు ప్రాంతాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు కనిపిస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లను దాటి వెళ్లరాదని భక్తులకు పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకూ గోదావరిలో నీటి మట్టం పెరిగింది. అధికారులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రాచలంలో పలు స్నానఘట్టాల వద్ద బారికేడ్లను ముందుకు జరిపే పనులు చేపట్టారు. కాగా, పుష్కరాల 9వ రోజు సైతం నదీతీరం వెంబడి ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ జామ్ షరా మామూలే. పలు చోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News