: బస్సులో తాళి కట్టేందుకు యత్నించిన ఉద్యోగికి దేహశుద్ధి!


నలుగురూ చూస్తుండగా, బస్సులో ఓ విద్యార్థినికి తాళి కట్టేందుకు ప్రయత్నించిన టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) ఉద్యోగికి దేహశుద్ధి జరిగింది. ఈ ఘటన తమిళనాడు మధురై సమీపంలోని మేలూరు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేలవలపు నుంచి మేలూరు వెళుతున్న బస్సులో అదే ప్రాంతానికి చెందిన కల్లానై (35) అనే ఉద్యోగి ప్రయాణిస్తున్నాడు. అదే బస్సులో మేలూరు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కలసి ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో కల్లానై ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మెడలో తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. ఆ విద్యార్థిని కేకలు వేయగా, ప్రయాణికులు అడ్డుకుని యువకుడిని చితకబాదారు. ఆపై మేలూరు మహిళా పోలీసు స్టేషనులో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News