: అగ్రనేతల పేర్లు చెప్పకపోతే ‘థర్డ్ డిగ్రీ’ తప్పదు... తెలుగు యువత నేతలపై ఏసీబీ ఒత్తిడి!


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు తమ పార్టీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని టీ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నిన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసిన సందర్భంగా ఆయనకు ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా పార్టీ అగ్రనేతల పేర్లు చెప్పాల్సిందేనని ఏసీబీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారట. ఇటీవల రెండు రోజుల పాటు విచారణకు హాజరైన టీడీపీ యువజన విభాగం 'తెలుగు యువత' నేత ప్రదీప్ చౌదరి, ఏసీబీ అధికారుల నుంచి ఈ తరహా ఒత్తిడినే ఎదుర్కొన్నారని టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లు కేసులో ముఖ్యనేతలకు ప్రమేయముందని చెప్పకపోతే, థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ కూడా తప్పదని ఏసీబీ అధికారులు బెదిరిస్తున్నారట. ఈ బెదిరింపులకు చెక్ పెడుతూ అడ్వొకేట్ సమక్షంలోనే తదుపరి విచారణ కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలని వారు గవర్నర్ ను కోరారు.

  • Loading...

More Telugu News