: పంతం నెగ్గించుకున్న కేసీఆర్!... ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓగా నాన్-ఐఏఎస్ నియామకం


తెలంగాణ సీఎం కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పటిదాకా లేని సంప్రదాయం వద్దన్న ఉన్నతాధికారుల వినతిని ఆయన తోసిపుచ్చారు. తాను తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయమంటూ తేల్చిచెప్పారు. వెరసి నాన్-ఐఏఎస్ అధికారి తొలిసారిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సీట్లో ఆసీనులైపోయారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా పనిచేసి రిటైర్ అయిన చంద్రశేఖర్ ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా సీఎం కేసీఆర్ ఇటీవల ఎంపిక చేశారు. అయితే ఇప్పటిదాకా ఆ సంప్రదాయం లేదని, పలు శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన సదరు పోస్టులో ఐఏఎస్ అధికారినే నియమించాల్సి ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సదరు ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి తిప్పిపంపారు. అయితే తన నిర్ణయమే ఫైనలని సీఎం కేసీఆర్ తేల్చేశారు. దీంతో చంద్రశేఖర్ ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News