: మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... భార్య, కుమార్తెలకు స్వల్ప గాయాలు
వైసీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురుతో కలిసి మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఎదురుగా దూసుకువచ్చిన ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోపిదేవికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆయన భార్య, కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని ప్రాథమిక చికిత్స నిమిత్తం విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు.