: 'ఓటుకు నోటు' కేసులో నేడు కోర్టుకు ‘ఫోరెన్సిక్’ తుది నివేదిక!


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ తన తుది నివేదికను నేడు ఏసీబీ కోర్టుకు అందజేయనుంది. కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్న ఆడియో, వీడియో టేపుల వాస్తవికతను నిర్ధారించుకునేందుకు ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికను కోర్టుకు అందజేసింది. తాజాగా వీటిపై మరింత శోధన చేసిన ల్యాబ్ సమగ్ర వివరాలతో కూడిన తుది నివేదికను కోర్టుకు అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో వేగం పెంచనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News