: జగన్ పై నారా లోకేశ్ ట్వీట్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేపట్టడంపై లోకేశ్ ట్విట్టర్లో స్పందిస్తూ... రాజకీయ యాత్రలతో రైతులకు నీళ్లు అందివ్వగలరా? అని ప్రశ్నించారు. మీరు రైతు మేలు కోరేవాళ్లే అయితే, పట్టిసీమ ప్రాజెక్టుకు ఎందుకు మద్దతివ్వరు? అంటూ ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు.