: గోదావరి తీరంలో 'బాపు-రమణ'ల విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు
సినీ రంగ దిగ్గజాలు, కళామతల్లి ముద్దుబిడ్డలు బాపు, రమణల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు ప్రాణ స్నేహితులు. ఇప్పుడా ఇద్దరూ ఇలపై లేరు. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వారు అందించిన సేవలకు గుర్తుగా ఇప్పుడా ఇద్దరి మిత్రుల విగ్రహాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గోదావరి తీరంలో ఆవిష్కరించారు. మహానుభావులైన బాపు, రమణ విగ్రహాలను గోదావరి తీరంలో ఆవిష్కరించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారు గోదావరి అందాలను సినిమాల ద్వారా ప్రత్యేకంగా చూపించారని కొనియాడారు.