: కోడల్ని తెచ్చుకోండి...!: లవ్ జిహాద్ కు పోటీగా బజరంగ్ దళ్ ప్రచారం
ఉత్తర భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన లవ్ జిహాద్ కు పోటీగా బజరంగ్ దళ్ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. 'బహు లావో... బేటీ బచావో' (కోడల్ని తెచ్చుకోండి... ఆడపిల్లను కాపాడండి) అంటూ ఆగ్రాలో స్కూళ్ల వెలుపల కరపత్రాలను పంపిణీ చేసింది. ఇతర మతాల యువతులను కోడళ్లుగా తెచ్చుకున్నా తమకు అభ్యంతరం లేదని దళ్ పేర్కొంది. త్వరలోనే మహిళా కళాశాలల్లోనూ దీనిపై ప్రచారం చేస్తామని బజరంగ్ దళ్ ఉత్తరప్రదేశ్ విభాగం కన్వీనర్ అవనీంద్ర సింగ్ తెలిపారు. లవ్ జిహాద్ ను అడ్డుకునేందుకే ఈ ప్రచారం చేపట్టామని పేర్కొన్నారు.