: గోదావరి హారతిపై వివాదం


గోదావరి పుష్కరాల్లో హారతిపై వివాదం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అంతా మెచ్చుకుంటున్నారు. కానీ హారతి ఇచ్చే విధానంపై వివాదం రేగుతోంది. గోదావరి నదీమతల్లికి హారతిచ్చే విధానం సరికాదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడుతున్నారు. ఆగమ శాస్త్ర విధానం ప్రకారం నదీమ తల్లికి హారతి ఇవ్వాలి కానీ, రాజమండ్రిలో హారతిచ్చే విధానం ప్రజలకు హారతి ఇస్తున్నట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి పంచాంగకర్త మధుర కృష్ణమూర్తి సమాధానమిస్తూ, గోదావరి, గంగా నదులు రెండూ ఒకేలా ఉండవని, గంగానది ప్రవాహ విధానం, గోదావరి ప్రవాహం వేరని ఆయన చెప్పారు. గోదావరి ఒడ్డున గోదారమ్మ విగ్రహం ఉంటుందని, దానికి పండితులు హారతి ఇస్తున్నారని తెలిపారు. నది వైపుగా తిరిగితే గోదావరి ఒడ్డున ప్రతిష్ఠించిన అమ్మవారిని వెనుక పెట్టినట్టు ఉంటుందని అది సరికాదని, అందుకే మధ్యే మార్గంగా నదిలో పీఠం ఏర్పాటు చేసి, అక్కడ నిల్చుని హారతి ఇస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై వివాదం సరికాదని, హారతి భక్తులను కళ్లకు అద్దుకోవాలని చెప్పడమే తప్ప, అందులో మరో ఉద్దేశ్యం లేదని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News