: ప్రధాని పిలుపుకు స్పందించా: గుత్తా జ్వాల


భారత బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల గ్యాస్ రాయితీ అంశంపై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాను గ్యాస్ రాయితీని వెనక్కి ఇచ్చేశానని, ధనిక వర్గాలు ఇలా చేయడం ద్వారా దేశంలో పేదలకు మేలు జరుగుతుందని జ్వాల అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... దేశంలోని సెలబ్రిటీలు, క్రీడాకారులు గ్యాస్ రాయితీని వెనక్కి ఇచ్చేయడం ద్వారా ఎంతోమంది పేదలకు మేలు చేసినవారవుతారని అన్నారు. గ్యాస్ ధరను భరించగలిగిన వారు రాయితీని వదులుకోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News