: సల్మాన్ ఓకే అంటే పది స్క్రిప్టులు సిద్ధం చేస్తా: రెమో డిసౌజా
బాలీవుడ్ కండల వీరుడి డేట్స్ కోసం ఎంత డిమాండ్ నెలకొంటుందో ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ రెమో డిసౌజా వ్యాఖ్య వింటే తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ఓకే అంటే, అతని కోసం పది స్క్రిప్టులు సిద్ధం చేస్తానని రెమో డిసౌజా చెప్పాడు. సల్మాన్ తాజా సినిమా 'భజరంగీ భాయ్ జాన్' సినిమాలో 'సెల్ఫీ లేలే' పాటకు నృత్య రీతులు సమకూర్చింది రెమో డిసౌజానే కావడం విశేషం. కాగా, రెమో డిసౌజా దర్శకత్వం వహించిన 'ఏబీసీడీ-2' విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెమో డిసౌజా మాట్లాడుతూ, తన దర్శకత్వ ప్రతిభపై సల్మాన్ కు నమ్మకం ఉందని అన్నాడు. సల్లూభాయ్ అంటే తనకు అంతులేని అభిమానమని, ఆయన సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని తెలిపాడు. సల్మాన్ ఖాన్ తనకు డేట్స్ కేటాయిస్తాడనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నాడు.