: ప్రజాధనాన్ని దోచుకోవడానికే తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారు: వామపక్ష నేతలు
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల డిజైన్ ను ప్రభుత్వం మార్చడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకే ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్ ను మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఈరోజు వామపక్షాల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, తదితర వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.