: అనంతపురం జిల్లాలో జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర ఈ సాయంత్రం ప్రారంభమైంది. పరుశరాపురం వద్ద ఆయనకు జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తరువాత శెట్టూరులో నిర్వహించనున్న బహిరంగసభలో జగన్ పాల్గొంటారు. అప్పులబాధ తాళలేక, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. రేపు కూడా ఈ యాత్ర జరుగుతుంది.