: అనుష్కా శర్మ చేతికి మరో బ్రాండ్
ఇప్పటికే పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడిన బాలీవుడ్ భామ అనుష్కా శర్మ చేతిలో మరో బ్రాండ్ వచ్చి పడింది. కేశ సంరక్షణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న 'ప్యాంటీన్' తమ ప్రొడక్టుల ప్రచారం కోసం అనుష్కా శర్మతో డీల్ కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, అనుష్క మీడియాతో మాట్లాడారు. తన బిజీ లైఫ్ కారణంగా అనేక రసాయనాలు, దుమ్ము, ధూళికి కురులు చెడిపోయాయన్న విషయాన్ని గమనించానని వివరించిన ఈ ముద్దుగుమ్మ, ప్యాంటీన్ వాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్ గా రావాలని కోరినప్పుడు ఆ ఉత్పత్తులు తన కేశ సంరక్షణకు ఉపయోగపడతాయా? అని సందేహించినట్టు తెలిపింది. ముందుగా తాను ఈ ప్రొడక్టులు వాడి చూసి సంతృప్తి చెందిన తరువాతనే, ప్రచారకర్తగా ఉండేందుకు ఒప్పుకున్నట్టు వివరించింది.