: తెలంగాణ వర్సిటీల్లో వీసీల నియామకంపై 'సెర్చ్' కమిటీ ఏర్పాటు


తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంపై ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది. ఇందుకు సంబంధించి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే వీసీల నియామకంపై కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వర్సిటీల పాలనను గాడిలో పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా వర్సిటీ చట్టాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్సిటీలకు ఒకే వ్యక్తి చాన్సలర్ ఉంటే పర్యవేక్షణ కష్టమవుతోందని, ప్రాధాన్యతకు అనుగుణంగా నిపుణుల నియామకం చేపట్టాలని పేర్కొన్నారు. వీసీలు, రిజిస్ట్రార్ ల నియామకాల మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు. అదేవిధంగా హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గా ఆచార్య యాదయ్యను సీఎం నియమించారు.

  • Loading...

More Telugu News