: రూ. 25 వేల దిగువకు పుత్తడి
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చితితో బంగారం ధర మరింతగా పతనమైంది. మంగళవారం నాటి సెషన్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 25 వేల రూపాయల దిగువకు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 81 తగ్గి రూ. 24,953 వద్దకు చేరింది. 2013 ఆగస్టు తరువాత పుత్తడి ధర ఇంత దిగువకు రావడం ఇదే తొలిసారి. కాగా, నేటి సెషన్లో వెండి ధర సైతం ఒత్తిడిని ఎదుర్కొంది. కిలో వెండి ధర 0.24 శాతం తగ్గి రూ. 34,062కు చేరింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతోనే ఇన్వెస్టర్ల పెట్టుబడులు బులియన్ మార్కెట్ నుంచి బాండ్లవైపు తరలుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.