: రైళ్లలో హద్దులు మీరవద్దు... చైనాలో యువతకు పోలీసుల వార్నింగ్
చైనాలో ఇటీవల లోకల్ ట్రైన్లో ఓ జంట ముద్దుముచ్చట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా, ఆ జంట తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా ఈశాన్య ప్రాంతం లియోనింగ్ ప్రావిన్స్ లోని షెన్యాంగ్ లో ఓ జంట పబ్లిగ్గా ముద్దుపెట్టుకోవడం వీడియోలో రికార్డయింది. ప్రభుత్వ మీడియా వెబ్ సైట్ లో దీనిపై హెచ్చరిక జారీ చేశారు. "సబ్ వేలో ముద్దుపెట్టుకుంటున్నారా?... జాగ్రత్త! పోలీసులు మీ చర్యపై దర్యాప్తు జరుపుతారు!" అని పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ కిస్సింగ్ ఉదంతంపై నెటిజన్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. 'కొంచెం సభ్యత ప్రదర్శించండి' అని కొందరు, 'మీ చుట్టు పక్కల పిల్లలెవరైనా ఉంటే వారి పరిస్థితి ఏంటి?' అని మరికొందరు ప్రశ్నించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని షెన్యాంగ్ పోలీసులు తెలిపారు.