: ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానాన్ని నిర్మిస్తున్న చైనా


ఆసియా పెద్దన్న చైనా మరో ఉత్పాదనతో ముందుకువస్తోంది. సముద్రాల్లో ఏవైనా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు సహాయక చర్యల్లో వినియోగించేందుకు వీలుగా ఓ ఉభయచర విమానాన్ని తయారుచేస్తోంది. ప్రపంచంలో ఇప్పుడున్న ఉభయచర విమానాల కంటే ఇది అతి పెద్దది. ఈ ఏజీ-600 మోడల్ విమానంలో 50 మంది వరకు ప్రయాణించవచ్చు. సముద్రంలో సులువుగా ల్యాండయ్యే వెసులుబాటు దీని సొంతం. ఈ విమానంపై ద్వీప దేశాలైన మలేసియా, జపాన్ ఎంతో ఆసక్తి చూపుతున్నాయని చైనా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న ఉభయచర విమానాల కంటే ఇది చాలా మెరుగైనదని ఈ ఎయిర్ క్రాఫ్ట్ డెవలపర్లంటున్నారు.

  • Loading...

More Telugu News