: ప్రియురాలి కోసం విమానాశ్రయం బయట మూడు గంటల పాటు ఎదురు చూసిన బాలీవుడ్ నటుడు


ప్రియురాలికోసం ఎదురు చూడడంలో ఉండే మజా అనుభవించాలని భావించాడేమో కానీ బాలీవుడ్ యువ నటుడు రణ్ వీర్ సింగ్ ప్రియురాలు దీపికా పదుకునే కోసం మూడు గంటలపాటు విమానాశ్రయం బయట ఎదురు చూశాడు. 'రాంలీలా' సినిమాలో జంటగా నటించిన రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేకు జత బాగా కుదిరింది. సినిమా ఫంక్షన్లలో జంటగా తెగ హడావుడి చేసే వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ కథనం. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే విదేశాల్లో సెలవులు గడిపేందుకు వెళ్లింది. కుటుంబంతోపాటు వింబుల్డన్ పోటీలను కూడా తిలకించింది. విరామంలో విరహాన్ని భరించలేకపోయిన రణ్ వీర్ సింగ్ ప్రియురాలిని రిసీవ్ చేసుకునేందుకు ఉత్సాహంగా ఎదురు చూశాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉండే ఓ థియేటర్లో సెకెండ్ షో సినిమా చూసి, నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయాడు. తెల్లవారు జాము నాలుగు గంటలకు వచ్చిన ప్రియురాలికి పూల బొకేతో స్వాగతం పలికి, కారులో తీసుకెళ్లిపోయాడు. ఆమె కోసం ఎదురు చూసే క్రమంలో మూడు గంటలపాటు కారులోనే వేచి చూడడం విశేషం.

  • Loading...

More Telugu News