: రూ. కోటి వేతనం ఆఫర్ చేస్తున్న 500 ఉద్యోగాలు... ఎవరికి దక్కేనో!


ఇప్పటివరకూ సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా వేతనం ఆఫర్ చేస్తున్న కంపెనీల్లో ఐటీ సంస్థలు నిలువగా, తాజాగా ఈ కామర్స్, ఫ్యాషన్, ట్రావెల్ సంస్థలు వచ్చి చేరాయి. దీంతో సమీప భవిష్యత్తులో సుమారు 500 మందికిపైగా ఉద్యోగులు కోటికి పైగా వేతనాలను పొందనున్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, ఓలా, ఉబెర్, కామన్ ఫ్లోర్, బుక్ మైషో, జబాంగ్, హంగామా, ఫ్యాషన్ అండ్ యూ వంటి కంపెనీలు సీనియర్లు కాకున్నా, చక్కటి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారికి పెద్ద పీట వేస్తున్నాయి. చదివింది ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, బీటెక్, ఎంటెక్ లు చేసినా చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసే సత్తా చూపగలిగితే చాలు. నలుగురితో కలుపుగోలు తనం, నాయకత్వ లక్షణాలు ఉన్న యువతకు ఎనిమిదంకెల వేతనం జేబులో వేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. కొత్తగా రానున్న కోటి వేతనం ఉద్యోగాలకు యువతలో పెను పోటీ ఉంటుందని అంచనా. కాగా, ప్రస్తుతం హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ సంస్థలో కోటికి పైగా వేతనం తీసుకుంటున్న వారి సంఖ్య 169గా ఉండగా, అందులో 50 శాతం మంది 40 ఏళ్ల లోపువారే. ఇక ఐటీసీలో 23 మంది, ఇన్ఫోసిస్ లో 123 మంది కోటికి పైగా వేతనాలు పొందుతున్నారు.

  • Loading...

More Telugu News