: ఐఎస్ కమాండర్ ను దిగంబరంగా ఊరేగించి ఉరి తీశారు!


ఎన్నో దారుణాలకు పాల్పడ్డ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపుకు లిబియాలో షాక్ తగిలింది. అల్ ఖైదా అనుబంధ సంస్థ ముజాహిదీన్ షూరా కౌన్సిల్ డెర్నా పట్టణంలో ఓ ఐఎస్ కమాండర్ ను ఉరి తీసింది. అంతకుముందు ఆ ఇరాక్ జాతీయుడిని డెర్నా వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. అతడి పేరు అబు అలీ అల్-అన్బారీ అని మీడియా వర్గాలు తెలిపాయి. "ఐఎస్ పక్షం వహించావు, అందుకే నీకీ శిక్ష" అంటూ అతడిని షూరా కౌన్సిల్ సభ్యులు ఉరి తీశారు. షూరా కౌన్సిల్... తీర ప్రాంత పట్టణమైన డెర్నాపై పట్టు సాధించేందుకు కొంతకాలంగా ఐఎస్ తో పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఆ ఐఎస్ కమాండర్ ను బందీగా పట్టుకున్నారు. కాగా, ఇరాక్, సిరియాల్లో ప్రాబల్యం పెంచుకున్న ఐఎస్ లిబియాలో మాత్రం ప్రతికూల ఫలితాలు చవిచూస్తోంది.

  • Loading...

More Telugu News