: సమష్టిగా పనిచేస్తే దేశంలో ఏపీనే నెంబర్ వన్: సీఎం చంద్రబాబు
అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలుస్తుందని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. సహజవనరులకు కొదవ లేని రాష్ట్రంలో సమష్టిగా పనిచేయడమే మిగిలిందని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన ఆయన కీలక ప్రసంగం చేశారు. ‘పారిశ్రామిక పెట్టుబడులు-మౌలిక సదుపాయాలు’ అన్న అంశంపై జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది.