: వరంగల్ బై ఎలక్షన్ పై టీ కాంగ్ సమీక్ష... ఉత్తమ్, భట్టి హాజరు


వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు దాదాపుగా అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నేడు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ స్థానానికి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించినట్లైంది. దీంతో ఆరు నెలల్లోగా ఈ స్థానానికి ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. ఇదే విషయాన్ని కేంద్రం ఎన్నికల కమిషన్ కు నివేదించనుంది. ఇదిలా ఉంటే, ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీల కంటే ముందు టీ కాంగ్రెస్ స్పందించింది. కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ లో దీనిపై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News