: భారీ భద్రత మధ్య బయటకొచ్చిన తీవ్రవాది భత్కల్


ఓ కేసులో విచారణ నిమిత్తం కరుడుగట్టిన తీవ్రవాది భత్కల్ ను పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ ను స్థాపించి, పలు పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ పారిపోయేందుకు ఐఎస్ఐఎస్ సహకారం అందిస్తోందని ఇంటెలిజన్స్ బ్యూరో వర్గాలు స్పష్టం చేసిన నేపథ్యంలో, భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే, వెంటనే స్పందించేందుకు అత్యాధునిక ఆయుధాలు ధరించిన పోలీసులు వెంటరాగా, భత్కల్ చేతులకు, కాళ్లకు బేడీలు వేసి కోర్టుకు తరలించారు. తిరిగి భత్కల్ ను మరికాసేపట్లో చర్లపల్లి జైలుకు తీసుకెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News