: పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె కావ్య మృతి
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ కుమార్తె కావ్య (21) చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించారు. హైదరాబాదులోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఆమె గత కొంతకాలంగా ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తీవ్రమైన తలనొప్పి రావడంతో నిన్న రాత్రి పిఠాపురం ఆసుపత్రిలో కావ్యను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కాకినాడకు తరలించినప్పటికీ, ఆమె ప్రాణాలు దక్కలేదు. చిన్న వయసులోనే కావ్య మరణించడంతో ఎమ్మెల్యే కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు పలువురు నేతలు సంతాపం తెలిపారు.