: ఏపీ ప్రభుత్వానికి సింగపూరేమైనా మేనమామా?: చంద్రబాబు సర్కారుపై రోజా విసుర్లు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఇతోధికంగా సహకరిస్తోందంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజా మండిపడ్డారు. ఏపీ సర్కారుకు ఉచితంగా సేవలు చేసేందుకు సింగపూర్ ధార్మిక సంస్థేమీ కాదని ఆమె అన్నారు. కొద్దిసేపటి క్రితం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా, చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించారు. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదన్న చంద్రబాబు ప్రకటనను ప్రస్తావించిన రోజా, ఏపీ సర్కారుకు సింగపూరేమైనా మేనమామా? అని ప్రశ్నించారు. పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సింగపూర్ బృందాన్ని పిలిచి చంద్రబాబు హంగామా చేస్తున్నారని రోజా విరుచుకుపడ్దారు.