: విపక్షాల దాడిని ఎదుర్కొనేదెలా?... మరికాసేపట్లో ఎంపీలతో నరేంద్ర మోదీ భేటీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. భూ బిల్లు సహా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి బీజేపీ నేతల సహకారంపై ప్రభుత్వంపై ముప్పేట దాడికి విపక్షాలు సర్వసన్నద్ధమయ్యాయి. మరి విపక్షాల దాడిని ఎలా ఎదుర్కోవాలి? ఇదే అంశంపై ఇప్పటికే ఎదురుదాడికి పథక రచన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టే విషయంపై పార్టీ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో గత యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సాగించాల్సిన పోరుపై ఆయన వారికి పలు సూచనలు చేయనున్నారు. మిగిలిన విపక్షాల వ్యూహాలు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రతివ్యూహాలను కూడా ప్రధాని ప్రస్తావించనున్నట్లు సమాచారం.