: 'బాహుబలి' సినిమాలా చంద్రబాబు 'రాజధాని' సినిమా చూపిస్తున్నారు: ఎమ్మెల్యే రోజా


ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియో తతంగాన్నంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా 'మగధీర', 'బాహుబలి' సినిమాలతో పోల్చారు. ఆ రెండు సినిమాలలా సీఎం రాజధాని సినిమా చూపిస్తున్నారని, దాంతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు, పుష్కరాల తొక్కిసలాట ఘటనలలో తన పాత్రను ప్రజలు మరచిపోవాలనే ఈ కొత్త సినిమా చూపుతున్నారని ఆరోపించారు. పుష్కరాల్లో ప్రచారం కోసం సినిమా తీయించడానికి జనాన్ని పోగుచేసి తొక్కిసలాట జరగడానికి బాబే కారణమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. వాటిని జనం మర్చిపోవాలనే ఈ రాజధాని వీడియోలను పదేపదే చూపుతున్నారన్నారు. ఆయన సినిమా చూసి టీడీపీ కార్యకర్తలో, ఓ సామాజికవర్గమో సంతోషించినా ప్రజలకు మాత్రం ఉపయోగపడదన్నారు. రాజధాని ప్రణాళికలో సామాన్యులకు, మధ్య తరగతి వారికి చోటెక్కడ కల్పించారని రోజా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News