: పార్టీ ఎంపీలతో భేటీ కానున్న సోనియా... పార్లమెంటులో వ్యూహాలపై చర్చ
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మరికాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్న ఈ భేటీకి పార్టీ ఎంపీలంతా హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ సర్కారుపై పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ఈ భేటీలో సోనియా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భూ బిల్లు, లలిత్ మోదీకి బీజేపీ నేతల సహకారం తదితరాలపై సర్కారును ఇరుకునపెట్టే వ్యూహాలకు పదును పెట్టనున్నారు. అంతేకాక సర్కారు తమపై విరుచుకుపడే అంశాలపై కూడా ఎదురు దాడికి సోనియా పథక రచన చేస్తున్నారు.