: నెత్తురోడిన పుష్కర దారులు!
పుష్కర దారులు నెత్తురోడాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం వారాడ సంతపాలెం వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టింది. రాజమండ్రి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసి స్వగ్రామానికి వస్తున్న వీరి వాహనం అదుపు తప్పి ప్రమాదానికి లోనుకాగా, ఈ ఘటనలో నలుగురు మరణించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో 12 మందికి గాయాలయ్యాయి. అన్నవరం దగ్గర వేగంగా వస్తున్న ఓ లారీ బైకును ఢీకొన్న దుర్ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంది. లారీ డ్రైవర్ మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి.