: పాక్ క్రికెటర్లతో స్టెప్పులేసిన సానియా మీర్జా... నెట్ లో హల్ చల్ చేస్తున్న వీడియో!
నిజమేనండోయ్, పాక్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డ్యాన్స్ చేసింది. అది కూడా వారి జట్టు విజయం సాధించినందుకట. ఆదివారం శ్రీలంకలో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు విజయం సాధించింది. దీంతో మ్యాచ్ ను చూసేందుకు వెళ్లిన సానియా మీర్జా సంతోషంతో ఎగిరి గంతేసింది. అంతేనా, ఆ సంతోషం పట్టలేక ఏకంగా స్టెప్పులేసింది. అది కూడా పాక్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి ఆమె వేసిన ‘డబ్ స్మాష్’ స్టెప్పులు ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయినా ఇందులో తప్పేముందిలే అంటున్నారు సదరు వీడియోను చూసిన వారంతా. ఎందుకంటే పాక్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఉన్నాడుగా. నిన్న విజయం సాధించిన జట్టులో మాలిక్ కూడా ఉన్నాడు. విజయం సాధించగానే సంతోషంలో మునిగిపోయిన మాలిక్, సానియా దంపతులు ఆ జట్టు సభ్యులతో కలిసి ‘అభీతో పార్టీ పార్టీ షుకూ హుయీ హై’ అనే పాటకు ‘డబ్ స్మాష్’ స్టెప్పులేశారు. ఈ వీడియోను మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.