: హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పింది ఎన్టీఆరే!: చంద్రబాబు కామెంట్!


హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పింది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావేనట. ఈ మేరకు ఏపీ సీఎం, ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న రాజమండ్రిలో ఆసక్తికర ప్రకటన చేశారు. ‘‘హైదరాబాదు జనం లేటుగా నిద్రపోయేవారు. అలాగే లేటుగానే నిద్ర లేచేవారు. కానీ ఎన్టీఆర్ వారికి ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాదీలు ఇంకా బాగా పనిచేయాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘శారీరక శ్రమ అంతగా అవసరం లేదు, మెదడుకు పనిపెడితే చాలు’’ అని కూడా చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News