: ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో బహుళ అంతస్తుల టవర్లు!


హైదరాబాదులో ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం కూల్చేయనుందా? అంటే అవుననే సీఎం కేసీఆర్ చెబుతున్నారు. హైదరాబాదులోని వారసత్వ కట్టడాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో బహుళ అంతస్తుల టవర్లు రెండు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. హైదరాబాదులో వారసత్వ కట్టడాలను గుర్తించడం, సంరక్షించడంపై ఆయన అధికారులతో చర్చించారు.

  • Loading...

More Telugu News