: కేజ్రీవాల్, బస్సీ మధ్య మరోసారి మాటల యుద్ధం


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పోలీస్ కమిషనర్ బస్సీ మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. ఢిల్లీలో ఓ యువతి హత్య కేసుతో రెండు విభాగాల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఢిల్లీలో పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలంటూ కేజ్రీవాల్ నిన్న ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై బస్సీ మండిపడ్డారు. ఢిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని అన్నారు. వ్యక్తికో లేక పార్టీకో జవాబుదారీగా ఉండదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కోరినట్టు ఢిల్లీ ప్రభుత్వ అధీనంలోకి పోలీసులను తేవాల్సిన అవసరం లేదని అన్నారు. యువతి హత్య కేసును చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నామని, వ్యక్తిగత ఆలోచనలను అమలు చేయడం లేదని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ వివరాలను కేజ్రీవాల్ కు అందజేశామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News