: కోళ్లు కూడా ఆత్మాహుతి దాడులు చేస్తాయి ... ఐఎస్ కొత్త వ్యూహం!
తన దుశ్చర్యలతో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ సంస్థ ఇప్పుడు కొత్త వ్యూహం సిద్ధం చేసింది. ఇకపై కోళ్లతోనూ దాడులు చేయాలని భావిస్తోంది. కోళ్లతో ఆత్మాహుతి దాడులు సులువుగా నిర్వహించవచ్చని ఐఎస్ వ్యూహకర్తలు విశ్వసిస్తున్నారు. కోడికి పేలుడు పదార్థాలు అమర్చి శత్రు శిబిరంలోకి పంపవచ్చని, కోడి కాబట్టి పెద్దగా ఎవరూ అనుమానించరని ఐఎస్ వర్గాలంటున్నాయి. కోడి శత్రువుల సమీపంలోకి వెళ్లాక, దానికి అమర్చిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ తో పేల్చివేయడం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం కలిగించవచ్చని ఇరాక్ లోని ఫజుల్లా నగర మిలిటెంట్లు చెబుతున్నారు.