: త్వరలోనే రాజమౌళితో సినిమా: మహేష్ బాబు


రాజమౌళితో కథా చర్చలు నడుస్తున్నాయని టాలీవుడ్ హ్యాండ్సమ్ మహేష్ బాబు తెలిపాడు. హైదరాబాదులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, త్వరలోనే రాజమౌళితో ఓ సినిమా ఉంటుందని అన్నాడు. రాజమౌళితో సినిమా గురించి మహేష్ బాబు స్వయంగా వెల్లడించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పచ్చు. ఈ సందర్భంగా 'బాహుబలి'ని మహేష్ బాబు మరోసారి ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ తరహా సినిమాను రాజమౌళి మాత్రమే తీయగలడని మహేష్ బాబు చెప్పాడు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రిన్స్ అభినందించాడు.

  • Loading...

More Telugu News