: బ్లడ్ ఇస్తే టికెట్లు ఇస్తారు!
రొమేనియాలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ సంగీత ప్రేమికులకు ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది. రక్తదానం చేస్తే ఎలక్ట్రో డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ కు టికెట్లు అందిస్తామని 'అన్ టోల్డ్' అనే సంస్థ మ్యూజికల్ లవర్స్ ను ఊరిస్తోంది. 'అన్ టోల్డ్' సంస్థ... నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఇన్ స్టిట్యూట్ తో సంయుక్తంగా 'పే విత్ బ్లడ్' పేరిట రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలో రొమేనియాలోని 42 నగరాల్లో ఈ నెలలో 10 రోజుల పాటు మొబైల్ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. బుఖారెస్ట్, క్లజ్ సిటీల్లో బ్లడ్ డొనేట్ చేసేవారికి ఉచితంగా టికెట్లు అందిస్తారు. మిగిలిన నగరాల్లో రక్తం దానం చేసేవారికి తగ్గింపు ధరలతో టికెట్లు అందిస్తారట.