: పేదల ఆసుపత్రిని ధనికుల ఆసుపత్రిగా మారుస్తున్నారంటూ వైజాగ్ లో ఆందోళన
పేదల ఆసుపత్రిని ధనికుల ఆసుపత్రిగా మారుస్తున్నారంటూ విశాఖపట్టణంలో ఆందోళన ప్రారంభమైంది. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా భావించే కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేజీహెచ్ లోని కార్డియాలజీ వార్డును కేర్ ఆసుపత్రుల నిర్వహణకు ఇవ్వడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు యాజమాన్య నిర్వహణలో ఓ వార్డు పెట్టడమంటే పేదలకు కేజీహెచ్ లో స్థానం లేదని చెప్పడమేనని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలోని జగదాంబ జంక్షన్ లో సీపీఎం సంతకాల సేకరణ చేపట్టింది. దీనికి విశేషమైన ఆదరణ లభిస్తోంది.