: నాలుగు విభాగాలుగా అమరావతి సీడ్ క్యాపిటల్ అభివృద్ధి
ఏపీ రాజధానికి ఈరోజు అందజేసిన సీడ్ క్యాపిటల్ బృహత్తర ప్రణాళికను నాలుగు విభాగాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు వెల్లడైంది. అందులో ఒకటి అమరావతి గేట్ వే, రెండవది అమరాతి డౌన్ టౌన్, మూడు అమరావతి ప్రభుత్వ కార్యాలయాల జోన్, నాలుగు అమరావతి వాటర్ ఫ్రంట్ పేరుతో రాజధానిని అభివృద్ధి చేయనున్నారు. సీడ్ క్యాపిటల్ మొత్తం 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఐదు దశలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సీడ్ క్యాపిటల్ ను నిర్మించాలని ప్రతిపాదించారు. 2050 నాటికి అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రణాళికలో తెలిపారు. కోటి పది లక్షల మంది నివసించేందుకు వీలుగా ఈ నగరాన్ని ప్లాన్ చేయగా, పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలో పెద్దపీట వేశారు.