: అమరావతి సీడ్ క్యాపిటల్ ప్లాన్ ను సింగపూర్ మంత్రి ఇచ్చారు: చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను ఏపీ ముఖ్యమంత్రికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అందజేశారు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో సీడ్ క్యాపిటల్ బృహత్ ప్రణాళికను ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చెందుతుందన్నారు. 3 లక్షల నివాసగృహాలకు అనుగుణంగా బృహత్ ప్రణాళిక రూపొందించారని చెప్పారు. బృహత్ ప్రణాళికతో 7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, ఆకర్షణీయ, పర్యావరణహిత, స్వయం సమృద్ధి నగరంగా అమరావతి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఏపీ ప్రజలు గర్వపడేలా అమరావతి నిర్మాణం ఉంటుందని తెలిపారు.