: కొనేవారికే కాదు... అమ్మేవారికీ రుణాలిస్తామంటున్న స్నాప్ డీల్!


అధిక ధర ఉన్న వస్తువులకు ఈఎంఐల రూపంలో నగదు చెల్లించేందుకు ఈ-కామర్స్ వెబ్ సైట్లు అంగీకరిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అమేజాన్ డాట్ కాం మరో అడుగు ముందుకు వేసి తమ వెబ్ సైట్ మాధ్యమంగా వస్తు ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టే వ్యాపారులకు రూ. 2 కోట్ల వరకూ రుణాలిస్తామని ప్రకటించింది. ఇందుకోసం టాటా కాపిటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. ఈ విషయాన్ని స్నాప్ డీల్, టాటా కాపిటల్ స్పష్టం చేశాయి. తమ మధ్య ఒప్పందం కుదిరినట్టు వేర్వేరు ప్రకటనల్లో వివరించాయి. ఇందులో భాగంగా ఆన్ లైన్ వ్యాపారులు కనీసం రూ. 5 లక్షల నుంచి తమకు అవసరమైనంత మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చని స్నాప్ డీల్ వివరించింది. ఈ-కామర్స్ రంగంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న వాడకం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా కాపిటల్ ఫైనాన్స్ విభాగం సీఓఓ ప్రదీప్ బండివడేకర్ తెలిపారు. కాగా, దేశంలోని 5 వేల ప్రాంతాలకు చెందిన 1.5 లక్షల మంది అమ్మకందారులతో స్నాప్ డీల్ సంబంధాలు నిర్వహిస్తోంది. వీరిలో అత్యధికులు చిన్న, మధ్య తరహా వ్యాపారులే!

  • Loading...

More Telugu News