: రాజీవ్ పై దాడికి యత్నించిన వ్యక్తికి టికెట్ ఇచ్చేది లేదన్న శ్రీలంక పార్టీ


శ్రీలంకలో 1987 జులై 30న అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఓ దాడి నుంచి తప్పించుకున్నారు. కొలంబోలో రాజీవ్ గౌరవవందనం స్వీకరిస్తుండగా, లంక నేవీకి చెందిన వింజెముని విజిత రోహన డిసిల్వా అనే సెయిలర్ రైఫిల్ బట్ తో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. అప్పట్లో రోహన చర్యపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కాగా, ప్రస్తుతం శ్రీలంకలో ఎన్నికల వేడి రాజుకుంది. అయితే, ఆనాడు రాజీవ్ పై దాడికి యత్నించిన రోహన తాజా ఎన్నికల్లో బోదు జన పెరుమన పార్టీ (బీజేపీపీ) తరపున పోటీ చేస్తాడని వార్తలు వెల్లువెత్తాయి. బీజేపీపీ అనుబంధ విభాగం బోదు బాల సేన (బీబీఎస్) రోహనను పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించడం వివాదాస్పదమైంది. దీనిపై విమర్శలు వచ్చాయి. వాటిపై బీజేపీపీ స్పందిస్తూ.... రోహనకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సభ్యత్వం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తామని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అతనికి తగినంత రాజకీయ అవగాహన లేదని కూడా వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News