: ప్రధాని బాటలో కర్ణాటక సీఎం!


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో రేడియో బాట పట్టారు. 'మన్ కీ బాత్' పేరిట ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండడం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలోని రైతులను ఓదార్చేందుకు సిద్ధరామయ్య వారాంతంలో ఓ రేడియో కార్యక్రమం నిర్వహించారు. గత రెండు నెలలుగా కర్ణాటకలో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో, బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఊరడించేందుకు సీఎం రేడియోను వేదికగా ఎంచుకున్నారు. బెంగళూరు రాజ్ భవన్ రోడ్డులో ఉన్న ఆలిండియా రేడియో కార్యాలయానికి వెళ్లిన సిద్ధరామయ్య 20 నిమిషాల పాటు ప్రసంగించారు. కాగా, సిద్ధరామయ్య ఇంతకుముందు కూడా ఓసారి రేడియోలో ప్రసంగించారు. 'అన్న భాగ్య' పథకానికి ప్రజాదరణ కల్పించేందుకు గాను ఆయన రేడియోలో మాట్లాడారు.

  • Loading...

More Telugu News