: ప్రేక్షకులతో కలసి 'బాహుబలి' వీక్షించిన ప్రభాస్


సినీ నటుడు ప్రభాస్ ఈరోజు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ప్రేక్షకులతో కలసి 'బాహుబలి' చిత్రాన్ని వీక్షించారు. ఈ సమయంలో ప్రభాస్ ను చూసేందుకు థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు తీవ్ర పోటీపడ్డారు. దాంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని అభిమానులతో పంచుకునే భాగంలోనే ప్రభాస్ అభిమానులను కలుసుకున్నారు. అంతేకాదు 'బాహుబలి'పై ప్రేక్షకుల స్పందనను కూడా స్వయంగా తెలుసుకున్నాడట. ప్రభాస్ రావడంతో అటు అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

  • Loading...

More Telugu News