: టీ-దేశం నేతలను ఆంధ్ర సరిహద్దుల దాకా తరిమికొడతాం: హరీష్ రావు నిప్పులు
తెలంగాణలో పుట్టి, ఆంధ్రా నేతల కొమ్ము కాస్తున్న తెలుగుదేశం నేతలను ఆ రాష్ట్ర సరిహద్దుల దాకా తరిమి తరిమి కొడతామని తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన టీ-టీడీపీ నేతలు ఆంధ్రా నేతల పాటకు వంత పాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవాలన్న కుయుక్తితో, సీడబ్ల్యూసీకి తెలుగుదేశం పార్టీ లేఖను ఇచ్చిందని ఆయన ఆరోపించారు. తక్షణం ఆ లేఖను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని హరీష్ స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం కలిగేలా ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని ఇక్కడి తెలుగుదేశం నేతలు ప్రశ్నించకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.