: ఎవరూ రాజీనామా చేయరు... సభా సమయాన్ని వృథా చేయొద్దు: విపక్షాలకు వెంకయ్య సూచన


ఏ ఒక్కరూ రాజీనామా చేయరని, అనవసరంగా రాద్ధాంతం చేసి సభా సమయాన్ని వృథా చేయొద్దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలకు సూచించారు. అఖిలపక్ష భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ ప్రశ్నపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏ ఒక్కరూ రాజీనామా చేయరు. అసలు రాజీనామా ప్రసక్తే లేదు. అనవసర రాద్ధాంతం చేసి సభా సమయాన్ని వృథా చేయకండి’’ అని ఆయన విపక్షాలకు సూచించారు.

  • Loading...

More Telugu News